హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta PS) సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్‌లో ఉన్న మొత్తం 82 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. హోంగార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. కీలకమైన సమాచారం బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి స్టేషన్ మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. ఈ బదిలీల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.