Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

-

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ అరెస్ట్ కావడం అంటూ జరిగితే కేంద్రంలో ప్రధాని పీఠానికి మోదీ రాజీనామా చేయక తప్పదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. అదానీ, అంబానీ లాంటి బడా పెత్తందారులను పెంచి పోషిస్తుందని రాహుల్ గాంధీ ఏనాడో చెప్పారని మహేష్ కుమార్ గుర్తు చేశారు.

- Advertisement -

అంతేకాకుండా అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం.. రేవంత్ రెడ్డి ఇంటి నిర్మాణానికి కాదని, స్కిల్ వర్సిటీ నిర్మాణానికని, ఆ మాత్రం తెలియకుండా కొందరు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి చురకలంటించారు. అంతేకాకుండా అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

‘‘అదానీ ని అరెస్ట్ చేస్తే ప్రధాని మోడీ(PM Modi) రాజీనామా చేయక తప్పదు. సెబీ ఛైర్మన్ మాధవి బుచ్(Madhabi Puri Buch) అదానీకి లాభం చేకూర్చింది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మోడీ రాజీనామా చేయాల్సి వస్తుంది. ప్రధాని అండతో అదానీ గ్రూప్ విచ్చలవిడిగా సంపద పెంచుకున్నారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలి. పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరపాలి. అందులో ఎవరు దోషులుగా తెలినా శిక్షించాల్సిందే. అదానీ.. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కట్టడానికి రూ.100 కోట్లు ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఇంటికి కాదు. కేటీఆర్ కూడా కావాలంటో ఓ రూ.50 కోట్లు స్కిల్ యూనివర్సిటీ కి ఇవ్బొచ్చు. వివిధ కంపెనీలతో ప్రభుత్వం రూ.45 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. లీగల్‌గా లేకుంటే ఏ ఒప్పందాన్నైనా ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. మేము ఎవరితో ఒప్పందం చేసుకున్న చట్టానికి లోబడిన కంపెనీలు ముందుకు పోతాయి, లేదంటే వెనక్కి తీసుకుంటాయి’’ అని Mahesh Kumar Goud వివరించారు.

Read Also: ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hydra | మనసు చంపుకుని పనిచేయాల్సి వస్తుంది: హైడ్రా రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(Hydra) చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర...

Harish Rao | రోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. మండిపడ్డ హరీష్ రావు

Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం...