Mahesh Kumar Goud | ప్రతి ఒక్కరికీ పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం: మహేష్ కుమార్

-

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్(Mahesh Kumar Goud) అధ్యక్షతన ఈరోజు గాంధీభవన్‌లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల గురించి, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుల గణన గురించి కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా చర్చించారు. వీటిలో ఉన్న లోటుపాట్లు, వీటిని ఇంకా మెరుగుపరచడానికి ఉన్న మార్గాల గురించి వారు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాల్సిన ప్రచారం, తీసుకోవాల్సిన చర్యలు సహా పలు అంశాలపై మహేష్ కుమార్ అధ్యక్షతన చర్చ జరిగింది.

- Advertisement -

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించాం. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు అంతా పది నెలల కాలంలో చేసి చూపించారు’’ అని అన్నారు.

‘‘రూ.18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 కే గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకోసం ప్రభుత్వం విజయోత్సవాలు చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలి. మనం చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రజలకు వివరించాలి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ(BJP)లు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చెస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలి.

అందుకు తగ్గట్టు మన ప్రచారం ఉండాలి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు వచ్చాయి. డీసీసీ(DCC) అధ్యక్షులకు అందరికి పదవులు వచ్చాయి. అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు వచ్చాయి. ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉంది. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలి. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని Mahesh Kumar Goud వివరించారు.

Read Also: తెలంగాణలో ముగిసిన ఎన్నికలు.. టీఓఏ విజేత ఎవరో..?
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...