బీఆర్ఎస్ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యవహారం తుది అంకానికి చేరుకుంది. హైదరాబాద్ లోని పొంగులేటి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెళ్లి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరడం దాదాపు ఖరారు కావడంతో ఇతర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. పొంగులేటి తో పాటు ఆయన అనుచరులు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) తిరిగి ఇండియాకు వచ్చాక పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో(Jupally Krishna Rao) పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. మొత్తానికి వీరి చేరికతో తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) పార్టీ బలం రెట్టింపు అవుతుందనడంతో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.