Hyderabad Traffic | రేపు హైదరాబాద్‌లో ఈ రూట్లలో ప్రయాణిస్తున్నారా?

-

Hyderabad Traffic | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) మంగళవారం హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం (జులై 4) ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హనుమాన్ ఆలయం, హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్‌కుంట ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. అటుగావెళ్లే వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు. బొల్లారం, అల్వాల్, లోత్‌కుంట, త్రిముల్‌ఘేరి, కార్ఖానా, జేబీఎస్, ప్లాజా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్.. రూట్లలో వచ్చే ట్రాఫిక్‌ను రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేరే రూట్లకు మళ్లిస్తారు. ఆ వాహనాలను హెచ్‌పీఎస్‌ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ మేరకు ఆయా సమయాల్లో వాహానదారులకు ట్రాఫిక్‌(Hyderabad Traffic) పోలీసులు సూచనలు జారీ చేశారు.

- Advertisement -
Read Also:
1. బండి సంజయ్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
2. దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెక్ట్స్‌ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...