హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద భారత రాజ్యంత నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. ఈ భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నెక్లెస్ రోడ్ తదితర మార్గాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు.
విగ్రహావిష్కరణ అనంతరం ఐమ్యాక్స్ థియేటర్ వెనకాల ఏర్పాలు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్న తరుణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను(Traffic Restrictions) విధించారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రొటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్ నిరంకారి వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలను తెల్లి తల్లి ఫ్లైఓవర్ వద్ద ఇక్బాల్ మీనర్ వైపు మళ్లిస్తారు.
Read Also: CM కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Follow us on: Google News, Koo, Twitter