హైదరాబాద్(Hyderabad) లో ఇటు భారీ వర్షం.. అటు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ దగ్గర నిర్మించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణను సీఎం కేసీఆర్ చేయనున్నారు. మధ్యాహ్నం 1-3గంటల మధ్య ఈ కార్యక్రమం ఉండనుంది. అనంతరం భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, పంజాగుట్ట, సోమాజిగూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించరు. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు పోలీసులు.
హైదరాబాద్(Hyderabad) లో ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజీగూడ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను షాదాన్, నిరంకారి వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసే వరకు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసివేస్తారు. కాగా రూ.146.50కోట్లతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా 20మంది బౌద్ధ గురువులు పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా విగ్రహంపై పూలవర్షం కురిపించనున్నారు.
Read Also: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా
Follow us on: Google News, Koo, Twitter