MLC కవితపై వ్యాఖ్యలు.. MP అర్వింద్ ఇంటిని ధ్వంసం చేసిన కార్యకర్తలు

-

TRS workers attack BJP MP Arvind’s house over remarks on MLC Kavitha: MLC కవితపై నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు మెరుపు దాడి చేశారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, ఒక్కసారి ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఇంట్లోని విలువైన వస్తువులు, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అర్వింద్ ఇంటికి చేరుకుని ఆందోళన చేస్తోన్న టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. అయితే దాడి సమయంలో ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరు.

- Advertisement -

కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ఎమ్మెల్సీ కవితపై పలు ఆరోపణలు చేశారు. ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పొలిటికల్ బాంబ్ పేల్చారు. పార్టీ మారే అంశంపై ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో చర్చలు కూడా జరిపారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఇక అర్వింద్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...