తెలంగాణ కేబినెట్(TS Cabinet) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలో సబ్ కమిటీ చేస్తామని చెప్పారు. దాదాపు 10 జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించిందని, తక్షణ సాయం చేయాలని నిర్ణయించామన్నారు.
TS Cabinet | రూ. 500 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ‘రోడ్లు, కాలువలకు తాత్కాలిక మరమ్మతులు చేపడతాం. 27 వేల మందికి పునరావాసం కల్పించాం. విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకుంటాం. నష్టపోయిన పంటపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. మున్నేరు వాగు వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.