టీచర్ల బదిలీలకు రాష్ట్ర హైకోర్టు(TS High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యంతర స్టే ఉత్తర్వులను మరించిన హైకోర్టు బదిలీలకు పచ్చ జెండా ఊపింది. టీచర్ల యూనియన్ల నేతలకు 10 అదనపు పాయింట్లను తప్పుబట్టిన హైకోర్టు.. టీచర్ల దంపతులకు అదనపు పాయింట్ల కేటాయింపునకు అనుమతి ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్ధేశమని హైకోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. కాగా, గతకొన్ని రోజులుగా బదిలీ ప్రక్రియ ప్రారంభించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా.. ఇవాళ ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారణ జరిపిన రాష్ట్ర న్యాయస్థానం రాఖీ పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది.