TS Inter Results | తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) విడుదల చేశారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 2.72 లక్షల మంది పాసయ్యారు. 3,80,920 మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 2,56,241 మంది పాసయ్యారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
జూన్ 4న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయని కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రేపటి నుండి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు. ఫలితాల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం అప్లై చేసుకోవాలని వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్టు నవీన్ మిట్టల్ తెలిపారు. మానసిక ధైర్యం కోసం 14416 అనే నెంబర్ కు విద్యార్థులు కాల్ చేయాలని సూచించారు.
రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేయండి. https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in
Read Also: యువతను బలిపశువులను చేసిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా?
Follow us on: Google News, Koo, Twitter