TS Inter Supply Results | తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, వొకేషనల్ విద్యార్థులు 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌కు చెందిన 2,52,055 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 1,57,741 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి 18,697 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10,319 మంది పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో జనరల్ విద్యార్థులు 46 శాతం, వొకేషనల్ విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌కు చెందిన 1,29,494 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 59,669 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి 11,013 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,579 మంది పాసయ్యారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చు.
Read Also: సాయిచంద్ భార్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat