TSPSC Changed Assistant Engineering Exam dates: తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్స్ పరీక్ష తేదీని మార్చినట్లు తెలిపింది. కాగా 833 అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 12న జరగాల్సిన ఈ పరీక్ష మార్చి 5కు మార్చినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఫిబ్రవరి 12న గేట్ ఎగ్జామ్ ఉండడంతో.. అసిస్టెంట్ ఇంజనీర్స్ పరీక్ష తేదీని పోస్ట్ పోన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీ కంటే వారం రోజుల ముందు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
TSPSC కీలక ప్రకటన.. ఆ పరీక్ష తేదీ మార్పు
-