TSPSC Releases 3 More Notifictions In Telangana: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర మొదలైంది. గ్రూప్స్ కి సంబంధించి వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది TSPSC. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. కళాశాల విద్యాశాఖలో 544 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తుల స్వీకరిస్తుంది. అలాగే మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
గుడ్ న్యూస్: మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన TSPSC
-