టీఎస్ ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. ‘‘తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది.
“పెండింగ్లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసింది. ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(VC Sajjanar), ఐపీఎస్ తెలిపారు.’’ సోషల్ మీడియా వేదికగా ఎండీ సజ్జనార్ ప్రకటించారు.