ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్

-

TSRTC |నష్టాల్లో ఆర్టీసీని గట్టేక్కించడానికి ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైటెక్‌ బస్సులను రంగంలోకి దింపుతోంది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ప్రైవేటు బస్సులో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు ఈ బస్సుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలో ఈ బస్సులు నడవనున్నాయి.

- Advertisement -

సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అంజయ్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ ఏసీ స్లీపర్‌ బస్సులకు అత్యాధునిక సాంకేతికను జోడించారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ.. ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. వీటితో పాటు బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

Read Also: పవన్ కల్యాణ్‌తో సినిమా చాన్స్‌ను సున్నితంగా తిరస్కరించా: మల్లారెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...