హైదరాబాద్‌ శివారులో చదువుకుంటున్నారా.. మీకే ఈ శుభవార్త!

-

TSRTC ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివారులో చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త చెప్పారు. శివారు ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను నడిపేందుకు రెడీ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లోని బస్‌ భవన్‌లో అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులను క్షేమంగా విద్యా సంస్థలకు, ఇంటికి చేర్చడం ఆర్టీసీ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు.

- Advertisement -

శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా గత వారంరోజులు క్రితమే 8 ట్రిప్పులను అదనంగా నడపటం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. దీంతో పాటు హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అంతేగాక, విద్యార్థినుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు.

TSRTC Increases Bus Trips to City Out scuts for Students

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...