Shalini Kidnap Case: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్.. షాకిచ్చిన షాలిని (వీడియో)

-

Twist in sircilla shalini Kidnap Case: తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్. వైశాలి కిడ్నాప్ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఘటన మరువకముందే మంగళవారం తెల్లవారుజామున షాలిని అనే 18 ఏళ్ళ యువతిని కారులో వచ్చిన యువకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో చోటుచేసుకుంది. షాలిని తన తండ్రితో కలిసి స్థానికంగా ఉన్న హనుమాన్ టెంపుల్ లో పూజ నిర్వహించేందుకు వెళ్ళింది. పూజ ముగించుకుని తిరిగి వస్తుండగా కారులో వచ్చిన యువకులు.. ఆమె తండ్రిపై దాడి చేసి, షాలిని ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

- Advertisement -

అసలు ట్విస్ట్ ఇదీ..

కిడ్నాప్ అయిన కొన్ని గంటలకే షాలిని ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి ప్రేమించిన వాడేనని, మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయాను అని తెలిపింది. కిడ్నాప్ చేసింది తాను నాలుగేళ్లుగా ప్రేమిస్తోన్న జానీ అని, ఓ గుడిలో ఇద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నాం అనే విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది.

కిడ్నాప్ సూత్రధారి ఎవరు?

షాలిని కిడ్నాప్(Shalini Kidnap) అవగానే తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించే గ్రామానికి చెందిన యువకుడే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అందరూ అదే నిజమనుకున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకుని వీడియోలు రిలీజ్ చేసేవరకూ ఆమె క్షేమం గురించి అంతా కంగారుపడ్డారు. అయితే రిలీజ్ చేసిన వీడియోలతో ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిన కిడ్నాప్ అని అర్ధమవుతుంది. కానీ పథకం రచించింది కిడ్నాప్ అయిన షాలిని కావడం ఊహించని ట్విస్ట్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించినవాడిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది యువతి. అందుకే తనని తీసుకెళ్లమని జానీకి ఫోన్ చేసి చెప్పినట్టు తెలిపింది. ఆమెని తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో జానీ ముఖానికి మాస్క్ ఉండడంతో గుర్తుపట్టలేదని వివరించింది.

Read Also: ఈ వాస్తు టిప్ ఫాలో అయి చూడండి.. సంపద రెట్టింపు అవుతుంది!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...