ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్.. 

-

తెలంగాణలో రాజకీయాలు వేడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చేవెళ్లలో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభను అధికార బీఆర్ఎస్‌ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. దీంతో ఈ కౌంటర్లకు కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా బదులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య ట్విట్టర్ నడుస్తోంది. ఇటీవల చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ ద్వారా దళిత, గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించారు.

- Advertisement -

ఈ డిక్లరేషన్‌పై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌పై పంచ్‌లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీది డిక్లరేషన్ సభ కాదని..అధికారం రానే రాదనే ఫ్రస్టేషన్‌ సభ అని ట్వీట్ చేశారు. కర్ణాటకలో కనీసం రేషన్‌ ఇవ్వలేని పార్టీ..తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు..మీ 12 గ్యారెంటీలను విలువ ఎక్కడిది..ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలిచ్చినా గాలిలో దీపాలేనని ప్రజలకు తెలుసు అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ,ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే..దానికి కారణం, ప్రధాన దోషే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తమ డిక్లరేషన్.. దళితులు, గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ సభ అని అన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్.. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. పార్టీ డిక్లరేషన్ ..మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటి కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని..ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదన్నారు. తమ డిక్లరేషన్..దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదని..ఇప్పుడు యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే..కేసీఆర్ ఖేల్ ఖతం బీఆర్ఎస్‌ దుఖాన్ బంద్ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...