నిజామాబాద్(Nizamabad) జిల్లా రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పాముకాటుతో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ముద్రిచ రవి (40), కుమారుడు వినోద్ (12) పాము కాటుతో మృతి చెందారు.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
- Advertisement -
రవి రోజులాగే వ్యవసాయం పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లి రాత్రి నిద్రిస్తున్న సమయంలో తిమ్మిర్లు వస్తున్నాయని భార్యకి చెప్పాడు. దీంతో పాము కాటుకు గురయ్యాడనే అనుమానం రావడంతో కొడుకును చూడగా అప్పటికే చనిపోయాడు. రవిని గ్రామస్తులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.