Harish Rao |శస్త్ర చికిత్సలు చేసి పసిపిల్లలకు ప్రాణం పోసిన యూకే వైద్యులకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు సన్మానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతీ వందమంది పిల్లల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు శస్త్ర చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదని, ఈ క్రమంలో అనేకమంది పేదలు సంతానాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలకు కార్పొరేట్ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరా పండుగ వరకు వరంగల్ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.
రూ.6 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని హరీష్ రావు(Harish Rao) తెలిపారు. అంతేగాక, మరో 2 వేల పడకలతో నిమ్స్‌ను విస్తరిస్తామని అన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు సొంతగడ్డపై సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలోకి సరికొత్త విజ్ఞానం, సాంకేతికత అందించాలని కోరారు. ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత.. నిమ్స్‌లోనే తొలిసారి గుండె శస్త్రచికిత్సలు జరుగనున్నాయని అన్నారు. ప్రస్తుతం 3 నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని అన్నారు.
Read Also: తెలంగాణలో TRS పేరుతో కొత్త పార్టీ!!
Follow us on: Google News