Kishan Reddy: ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్(KCR) కొన్న మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. ఆ నలుగురు (టీఆర్ఎస్) TRS ఎమ్మెల్యేలతో బీజేపీకి ఏం పని అని నిలదీశారు. ‘‘నందకుమార్ తెలుసు కానీ, ఆయన నా అనుచరుడు కాదు. నందు ప్రస్తుతం టీఆర్‌ఎస్ (TRS)లోనే ఉన్నాడని కేసీఆర్ తెలుసుకోవలి. ఎవరైనా పదువులకు రాజీనామా చేస్తేనే బీజేపీ పార్టీలో చేర్చుకుంటాం. తొలుత రూ.100 కోట్లు అని, తర్వాత రూ.15 కోట్లు అన్నారు. ఆధారాలు చూపించలేకపోయారు. ఆ నలుగురిని బీజేపీలో చేర్చుకుంటే ప్రభుత్వం పడిపోతుందా?. ఆ నలుగురు మా పార్టీలోకి వస్తే ఏంటి?.. రాకపోతే ఏంటి? అని Kishan Reddy నిలదీశారు.
Read also: 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్