Uppal double murder case: ఉప్పల్‌ జంట హత్య కేసులో ట్విస్ట్‌

-

Uppal double murder case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీ కొడుకుల జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ఊహించిన పోలీసులకు.. విచారణలో అనూహ్యమైన విషయాలు బయటపడ్డాయి. క్షుద్రపూజలు, మూఢ నమ్మకాల నేపథ్యంలోనే హత్యలు చేసినట్లు పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళ్తే, ఉప్పల్‌లో నివాసం ఉంటున్న నర్సింహ శర్మ, ఆయన కుమారుడు శ్రీనివాస్‌ ఈనెల 14న వారి ఇంటి వద్దే దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో వచ్చిన దుండగలు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దర్నీ చంపేశారు.

- Advertisement -

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాల కారణంగా హత్య (Uppal double murder case) జరిగి ఉంటుందని అనుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మెుత్తం 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, హత్య చేసిన ఇద్దరు నిందితులను వైజాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు గల కారణాలు:
మృతుడు నర్సింహ శర్మ పూజలు చేస్తూ, జీవనం గడిపేవారు. ఈ క్రమంలో మామిడిపల్లికి చెందిన వినాయక్‌ రెడ్డి, సంతోష్‌ నగర్‌కు చెందిన బాలకృష్ణారెడ్డిలు నర్సింహ శర్మతో తమ ఇంట్లో పూజలు చేయించారు. కానీ అప్పటి నుంచే వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయారు. దీంతో నర్సింహ శర్మ పూజల కారణంగానే తమ ఆరోగ్యం, ఆదాయం తగ్గిందన్న కక్షతోనే హత్యకు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. హత్య చేసేందుకు సుమారు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. మృతుల ఇంటి సమీపంలోనే ఓ హాస్టల్‌లోనే నిందితులు బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నర్సింహ శర్మకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

ఒక కుమారుడు శ్రీనివాస్‌ మూడు నెలల క్రితమే మలేషియా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఘటన జరిగిన రోజు పూజ పేరిట ఇద్దరు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి.. ఒక్కసారిగా నరసింహ శర్మపై కత్తితో దాడికి తెగబడ్డారు. తండ్రి అరుపులు, కేకలు విని, బయటకు వచ్చిన శ్రీనివాస్‌.. దుండగలను అడ్డుకోవటానికి ప్రయత్నించాడు. దీంతో ఆయనపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తండ్రీ కొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వైజాగ్‌లో తలదాకుంటున్న నిందితులను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Fennel Seeds | సోంపుతో సూపర్ ప్రయోజనాలు..

మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా...

Manchu Manoj | నాకా నమ్మకం ఉంది: మనోజ్

నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం...