తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఉప్పల్ స్కైవాక్(Uppal Skywalk)ను ఇవాళ(జూన్ 26) మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో అతిపొడవైన స్కైవాక్‌లలో ఒకటైన దీనిని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ నిర్మించింది. కాగా, హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటి. ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటడం అంత సులువు కాదు. నలువైపులా నుంచి వచ్చే వాహనాలతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక సెలవు రోజులు, పండుగ సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పాదచారులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా సర్కార్ స్కైవాక్(Uppal Skywalk)ను నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. ప్రారంభం అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేటీఆర్(KTR) పాల్గొంటారు.
Read Also:
1. లైంగిక వేధింపుల కేసు: భారత రెజ్లర్ల సంచలన నిర్ణయం
2. తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat