Uttam Kumar Reddy: ఉత్తమ్ సంచలన సవాల్.. రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ప్రకటన

-

Uttam Kumar Reddy Sensation Comment On Upcoming Assembly Elections: నల్గొండ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఆయన భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో 50 వేల మెజారితో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ కు మంచి బలం ఉందని తెలిపారు. 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుండి తప్పుకుంటానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యునంతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.  1994 నుండి రాజకీయాల్లో ఉంటున్నానని అప్పటి నుండి ఇప్పటివరకు 5 సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీ గా గెలిచానని పేర్కొన్నారు. తనకు పదవులు, ఆస్తులపై ఎలాంటి వ్యామోహం లేదని.. ఇప్పటికి కోదాడ, హుజుర్ నగర్, హైదరాబాద్ లలో అద్దెకి ఉంటున్నట్లు ఉత్తమ్(Uttam Kumar Reddy) వెల్లడించారు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...