వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

-

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన శాసన సభ్యత్వం రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

2018 ఎన్నికల్లో కొత్తగూడెం(Kothagudem) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టు జూలై 25న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ జలగం వెంకట్ రావు( Jalagam Venkat Rao)కి అయిన కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. డిసెంబర్ 12, 2018 నుంచి ఈ తీర్పు అమలులోకి వచ్చేలా ఓడిపోయిన అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా న్యాయస్థానం ప్రకటించింది.

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో వనమాపై నమోదైన కేసు వివరాల్ని ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని జలగం తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాలు వాదనలు విన్న హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు స్థానంలో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటిస్తూ తుది తీర్పు వెల్లడించింది.

అయితే తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao) సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వనమా పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Read Also: అన్నయ్య వదిలేశాడు.. తమ్ముడు వడ్డీతో సహా ఇస్తాడు.. ప్రత్యర్థులకు హైపర్ ఆది వార్నింగ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్...

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....