e-racing Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కొనసాగనున్న ఈ రేసింగ్ కార్ల ట్రాక్ పై గందరగోళం నెలకొంది. పోటీ కోసం సిద్ధం చేసిన ట్రాక్ పైకి అనూహ్యంగా సాధారణ వెహికల్స్ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయినా.. రేసింగ్ ట్రాక్ పైకి సాధారణ వెహికల్స్ రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. వాహనాలు అనుమతించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. కాగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
- Advertisement -
Read Also: