అసెంబ్లీ సమావేశాల వేళ MLA పాడి, MLC బల్మూరిల వీడియోస్ వైరల్

-

Balmoori Venkat – Padi Kaushik Reddy | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ అసెంబ్లీ వద్ద ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. హుజురాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు అసెంబ్లీకి వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ శ్రేణులు బల్మూరి వెంకట్ వీడియోను వైరల్ చేస్తుంటే.. బీఆర్ఎస్ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి వీడియోను విపరీతంగా షేర్స్ చేస్తున్నారు. ఇంతకీ వారు అంత ఇంట్రెస్టింగ్ గా ఏం చేశారంటే…

- Advertisement -

బల్మూరి వెంకట్(Balmoori Venkat) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. బస్సులో మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో ప్రయాణిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టానికి నిరసనగా ఆటోలో వచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే, కౌశిక్ రెడ్డి వచ్చిన ఆటోని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: అసెంబ్లీలో తమిళిసై స్పీచ్.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...