ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి(Vijayashanthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడే ప్రజాస్వామ్య పంథాలో నడుస్తోంది అన్నారు. అన్ని ప్రభుత్వరంగాలు విధానపరంగా పడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టును పెట్టారు.
“2014 రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి… మొదటిసారి ఈ 2023 డిసెంబర్‌ల… అసెంబ్లీ విధానపరంగా జరుగుతున్నది. ఏండ్ల పిదప వాస్తవానికి ఇప్పుడు, సెక్రెటేరియట్ పూర్తిస్థాయిల పనిచేస్తున్నది. సుమారు దశాబ్దపు పరిపాలన అనంతరం నిజానికి ఈ కొన్ని దినాలకెల్లి, ప్రజా ప్రభుత్వంల.. కొట్లాడి తెచ్చుకున్న, తెలంగాణ(Telangana)… ప్రజాస్వామ్య పంథాల నడుస్తుందన్న నమ్మకం.. కోట్లాది ప్రజలకు ఏర్పడుతున్నది ఇప్పుడే.. ఇప్పుడిప్పుడే బహుశా.. 26 సంవత్సరాల పోరాటం తర్వాత మీ రాములమ్మ మరి ఇప్పుడు ఇంకా ఏమి చెయ్యాలని ఎవలైనా అడిగితే… కాలం తెలంగాణ ప్రజలకు మేలు చూపాలి, భవిష్యత్ ఈ భూమి బిడ్డలకు ఎన్నటికీ మంచిగుండాలె అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటా..” అని ఆమె(Vijayashanthi) ట్వీట్ చేశారు.
2014 రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి… మొదటిసారి ఈ 2023 డిసెంబర్‌ల…
అసెంబ్లీ విధానపరంగా జరుగుతున్నది. ఏండ్ల పిదప వాస్తవానికి ఇప్పుడు,సెక్రెటేరియట్ పూర్తిస్థాయిల పనిచేస్తున్నది. సుమారు దశాబ్దపు పరిపాలన అనంతరం నిజానికి ఈ కొన్ని దినాలకెల్లి, ప్రజా ప్రభుత్వంల..
కొట్లాడి… pic.twitter.com/NoZ5kgG39y
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 17, 2023