బీజేపీకి మరో బిగ్ షాక్.. విజయశాంతి రాజీనామా

-

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వీడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె స్పందించలేదు. తాజాగా ఆమె బీజేపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రాములమ్మ హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy), ఏనుగు రవీందర్ రెడ్డి(Ravinder Reddy), వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) లాంటి నేతలు బీజేపీని వీడారు. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి(Vijayashanthi) తొలుత బీజేపీలో చేశారు. అనంతరం 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో కేసీఆర్ విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్‌లో ఆ పార్టీని విలీనం చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తిరిగి బీజేపీలో చేరారు.

Read Also: వరల్డ్ రికార్డు సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...