బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(VV Lakshmi Narayana) సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం వెనకడుగు వేయడంపై లక్ష్మీనారాయణ స్పందించారు. ‘‘కేసీఆర్ గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు.. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొనాలి.’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆ క్రెడిట్ అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
Thanks to Sri. KCR garu #KCR for taking steps to participate in EOI of Vizag Steel by sending a team.This has made the Govt. of India for the time being not to go in for privatisation & instead strengthen RINL. Govt of Telangana should participate in the bid . @KTRBRS @BRSHarish
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 13, 2023
Read Also: ఏలేటి బీజేపీలో చేరడంపై బండి సంజయ్ రియాక్షన్
Follow us on: Google News, Koo, Twitter