MLA Rajender Reddy | ‘హౌలే సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్’.. రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

-

వరంగల్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) చేసిన విమర్శలకు కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్.. తమ మేనిఫెస్టోలో ఎన్ని హామీలను నెరేవర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కబ్జా చేసిన పార్టీ ఆఫీసులో కూర్చుని కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము చర్చకు సిద్ధమని, వరంగల్ అభివృద్ధికి పదేళ్లలో ఏం చేశారో మీరు చెప్తే.. ఏడాదిలో ఏం చేశామో మేము చెప్తాం అని సవాల్ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము బీఆర్ఎస్ వాళ్లకు ఉందా అంటూ ధ్వజమెత్తారు.

- Advertisement -

‘‘‘పదేళ్లు మీ మేనిఫెస్టోలో పెట్టిన ఎన్ని హామీలు నెరవేర్చారు..? హౌలే సంఘానికి కేటీఆర్ అధ్యక్షుడు. పథకాల పేరు చెప్పి అన్నిట్లో దోచుకున్న చరిత్ర కేటీఆర్‌ది. ఐదేళ్లు మహిళా మంత్రిని చేయలేని దద్దమ్మలు మా మంత్రుల గురించి మాట్లాడుతారా. చీపుర్లు పట్టి మహిళలే కేటీఆర్‌ను తరిమి కొడతారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన(Caste Census) చెపిస్తుంటే, ఎదురు తిరగమని కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు’’ అని మండిపడ్డారు ఎమ్మెల్యే(MLA Rajender Reddy).

Read Also: ‘ప్రజలు ఉరికించి కొడతారు’.. కాంగ్రెస్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...