ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్(Fake News)తో పాటు ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్(Cyber Crime) నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం. నేరాల విధానం చాలా వేగంగా మారుతుంది. ఫేక్ న్యూస్ తో ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు దేశంలో మర్డర్, దోపిడీ లు తీవ్ర నేరాలుగా ఉండేవి. ఇప్పుడు అత్యంత పెద్ద నేరం సైబర్ నేరం’’ అని అన్నారు.
‘‘పోలీస్ అధికారులు నిరంతర కృషి తో తెలంగాణలో సైబర్ నేరాలు కట్టడి చేస్తున్నాం. తెలంగాణను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ప్రతి సెకండ్ సైబర్ నేరాల జరుగుతున్నాయి. నేరం జరిగిన తరువాత పోలీసులు పెట్టుకునేవారు, ఇప్పుడు నేరం జరగకుండా పోలీసులు నిరోధించాలి. దేశం మొత్తం ఒక తాటీ పైకి వచ్చి సైబర్ క్రైం పై పోరాడాలి. సోషల్ మీడియా ను కంట్రోల్ చేయాలి. తప్పుడు సమాచారం సమాజానికి శ్రేయస్కరం కాదు. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ న్యూస్‌తో చాలా ప్రమాదం ఉంది’’ అని Revanth Reddy హెచ్చరించారు.