KTR | ‘అనుకూల కంపెనీలకే టెండర్లు’.. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

-

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని స్ఫష్టం చేశారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తామని, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని నిలదీస్తామంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల టెండర్లను ఎక్కువకు వేసినా కూడా అనుకూల సంస్థలకు మాత్రమే కట్టబెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని, తమకు అధిక కమిషన్లు ఇచ్చే వారికే టెండర్లను కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

- Advertisement -

‘‘సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట, కొండగల్ లిఫ్ట్ టెండర్లు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అధ్వాన పాలన కోణాలను బహిర్గతం చేశాయి. ఈ టెండర్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్‌కు అందించడం కోసం ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ వంటి దిగ్గజ కంపెనీలను సైతం వెనక్కు నెట్టారు. ఇందుకు సాంకేతిక కారణాలను చూపుతోందీ అవినీతి ప్రభుత్వం. మీ అబద్ధాలను ప్రజలు పసిగడుతున్నారు. మీరు చేస్తున్న అవినీతి వాళ్లకు కనిపించట్లేదని అనుకోకండి. వాళ్లూ అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రూ.4,350 కోట్ల ప్రజా ధనాన్ని కొందరికి అప్పగించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తమ ఖజానా నింపుకోవడం కోసం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది’’ అని కేటీఆర్(KTR) విమర్శలు గుప్పించారు.

Read Also: సంజు అదరగొట్టాడు.. సిగ్గుపడకుండా చెప్తున్నా: ఐదెన్ మార్‌క్రమ్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...