Weather Report |తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ 22.0 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report |ఇక ఈరోజు, రేపు కూడా పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని, చల్లని పానియాలు, తేలికపాటి ఆహారాలు సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: వేసవిలో దొరికే పుచ్చకాయను ప్రతిరోజూ తినవచ్చా?
Follow us on: Google News, Koo, Twitter