ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం విచారించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తిగా కాగా కోర్టు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంటూ న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా పీఎంఎల్ఏ లబ్దిదారులను ప్రొవిజన్ కింద విద్యావంతులు, అధునాతన మహిళలు బెయిల్‌కు అర్హులు కాదన్న ఢిల్లీ హైకోర్టు పరిశీలనకు కూడా సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది.
‘‘దర్యాప్తు పూర్తయింది. ఛార్జ్‌షీట్స్ కూడా దాఖలు చేయబడ్డాయి. కాబట్టి కవిత(MLC Kavitha)ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే ఐదు నెలల నుంచి జైలులోనే ఉంటున్నారు. అతి త్వరలో ఈ కేసు కోర్టు విచారణ పూర్తి కావడం అనేది అసాధ్యం. అనేక కేసుల్లో ఈ కోర్టు చెప్పిన విధంగా.. అండర్ ట్రైల్ కస్టడీ అనేది శిక్షలా మారకూడదు’’ అని న్యాయస్థానం పేర్కొంది.