Extramarital Affair: భార్య రాసిన మరణశాసనం..వెలుగులోకి..!

-

Wife kills Husaband for Extramarital Affair: అన్యోన్యంగా ఉండే వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భర్తకు తెలియకుండా భార్య మరొక వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుంది. వారి అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి… చంపేందుకు భార్యే ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రణాళిక ప్రకారం బీరులో విషం కలిపి.. భర్తతో తాగించింది. అస్వస్థతకు గురైన భర్తను ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తరలించిందా భార్య. పరిస్థితి విషమించి భర్త మరణించటంతో, కుటుబంసభ్యుల ముందు భోరున విలపించింది. కానీ అనుమానం వచ్చిన మృతుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది.

- Advertisement -

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం చిల్కమర్రిలో రవితేజ, అనిత అనే దంపతులు నివాసం ఉండేవారు. అనితకు వికారాబాద్‌ జిల్లా, నవాబ్‌పేట మండలం దర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామితో సాన్నిహిత్యం ఏర్పడింది. అదికాస్తా, వివాహేతర సంబంధానికి (Extramarital Affair) దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియకుండా, ఎటువంటి అనుమానం రాకుండా మానేజ్‌ చేస్తూ వచ్చింది అనిత. కానీ, తమ బంధానికి భర్త ఎక్కడ అడ్డు వస్తాడో అని భావించిన అనిత, ప్రియుడు రామస్వామితో కలిసి.. భర్త రవితేజను చంపేందుకు పక్కా ప్లాన్‌ రచించింది. గత నెల 27న బీర్‌లో విషం కలిపి రవితేజకు ఇచ్చారు. అందులో విషం ఉందన్న విషయం తెలియక, రవితేజ బీర్‌ తాగేశాడు. అనంతరం అతడు అస్వస్థతకు గురవ్వటంతో.. భార్య అనిత ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.

రవితేజ పరిస్థితి విషమించటంతో, ప్రైవేటు ఆసుపత్రి వారి సూచన మేరకు ఉస్మానియా ఆసుపత్రికి రవితేజను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, రవితేజ కన్నుమూశాడు. అయితే, తనకు ఏమీ తెలియదన్నట్లు మహానటి రేంజ్‌లో యాక్టింగ్‌ మెుదలుపెట్టింది అనిత. ఘటనపై అనుమానం వచ్చి, మృతుడు తండ్రి చెన్నయ్య పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టగా, ఈ షాకింగ్‌ నిజం వెలుగులోకి వచ్చింది. అనిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజాలు బయటపెట్టింది. కోళ్లఫామ్‌లో పనిచేసే, రామస్వామికి, తనకు ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారిందని అనిత విచారణలో తెలిపింది. ఇద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడనే, పథకం ప్రకారం బీరులో విషం కలిపి, హత్య చేసినట్లు నిందితురాలు వివరించింది. దీంతో పోలీసులు అనిత, ప్రియుడు రామస్వామిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...