Interest Free loans |మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రూ.750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఎత్తున వడ్డీ లేని రుణాలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఈ రోజు(మార్చి 6) 250 కోట్ల రూపాయలను పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పురపాలక పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
- Advertisement -
Read Also: నిరుద్యోగులకు అలర్ట్.. హైదరాబాద్ మెట్రోలో జాబ్స్
Follow us on: Google News