హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం

-

Yamaha Motor India group starts the call of the blue weekend event at Hyderabad: యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ తమ అనుసంధానిత బ్రాండ్‌ ప్రచారం ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ ను ప్రారంభించింది. ఈ సంవత్సరం తమ మొట్టమొదటి వీకెండ్‌ యాక్టివిటీగా హైదరాబాద్‌లో ప్రారంభించింది. ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ వద్ద నున్న జలవిహార్‌ వాటర్‌ పార్క్‌ వద్ద నిర్వహించారు. దాదాపు 1300 మంది యమహా అభిమానులు మరియు బ్లూ స్ట్రీక్స్‌ నుంచి ( యమహా యజమానుల తో కూడిన కమ్యూనిటీ) 1000కు పైగా రైడర్లు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమం ద్వారా, ప్రతి మోటర్‌సైకిల్‌ అభిమానికీ సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం కలిగింది. దీనితో పాటుగా యమహా ప్రీమియం మోడల్‌ శ్రేణిలో అత్యుత్తమ సాంకేతికత, పనితీరు , భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జింఖానా రైడ్‌ లాంటి కార్యక్రమాలనూ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్ధులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ సవారీ నైపుణ్యాలను సైతం మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది. ఈ ఉత్సాహాన్ని మరింతగా నిర్మించేందుకు టెస్ట్‌ రైడ్‌ కార్యకలాపాలతో పాటుగా యమహా ఉత్పత్తి శ్రేణి, యాక్ససరీలు, అప్పెరల్స్‌ జోన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మరో ప్రధానమైన ఆకర్షణగా స్టైలింగ్‌ జోన్‌ నిలిచింది. దీనిలో వినియోగదారులు ఫేస్‌ పెయింటింగ్‌, టాటూ ఆర్ట్‌లో లీనమయ్యారు. ఈ కంపెనీ ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ ఈవెంట్లను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సైతం సంవత్సరమంతా నిర్వహించడం ద్వారా బ్రాండ్‌ నిబద్ధత పట్ల అవగాహన మెరుగుపరచనుంది.

‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌ యాక్టివిటీ తో యమహా భారతదేశ వ్యాప్తంగా తమ ఉత్సాహపూరిత శ్రేణి, స్పోర్టీ మోడల్స్‌ను ప్రదర్శిస్తుంది. వీటిలో ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌–ఆర్‌15 వెర్షన్‌ 4.0 (155సీసీ); ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌ – ఆర్‌15ఎస్‌ వెర్షన్‌ 3.0 (155 సీసీ); ఏబీఎస్‌తో ఎంటీ–15 (155 సీసీ) వెర్షన్‌ 2.0 ; బ్లూ కోర్‌ టెక్నాలజీ ఆధారిత మోడల్స్‌ అయిన ఎఫ్‌జెడ్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్‌–ఎస్‌ ఎఫ్‌1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్‌–ఎఫ్‌1(14సీసీ) ఏబీఎస్‌తో ; ఎఫ్‌జెడ్‌–ఎక్స్‌(149సీసీ) ఏబీఎస్‌తో మరియు యుబీఎస్‌ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), రేజెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ) ఉంటాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...