R Krishnaiah |టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 25 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు విఘాతం కలుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైన.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలు వేసుకుంటున్నాయని అన్నారు. అసలు పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే నిజనిజాలు బయటికి వస్తాయని కృష్ణయ్య(R Krishnaiah) తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే తొమ్మది మంది నిందుతులను అరెస్ట్ చేసి, సిట్ రెండవ రోజు 7 గంటలపాటు విచారించింది.
ఈ విచారణలో నిందితుల నుండి పలు కీలక విషయాలను సిట్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. పేపర్ చేతులు మారిన రాజేశ్వర్, రాజేందర్ల నుంచి అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారు. పేపర్లు ప్రవీణ్ నుంచి రేణుకకు చేరిన తరువాత రాజేశ్వర్, రాజేందర్ కు ఇచ్చిన అంశంలో రేణుకను ప్రశ్నించింది సిట్., ప్రవీణ్ కు తెలియకుండా ఇతరులకు పేపర్ ను ఇవ్వడానికి రేణుక డీల్ కుదుర్చుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. పేపర్ మరికొంత మందికి ఇవ్వడానికి రేణుక ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. మొత్తం ఎన్ని పేపర్స్ అమ్మకానికి ప్లాన్ చేశారనే కోణంలో ఇవాళ అధికారులు విచారణ చేశారు.
Read Also: మంత్రి నిరంజన్ రెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News Koo