బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూపల్లి వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉన్నారు. చేరిక అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ నలుగురి కోసం ఖర్చు చేస్తున్నాడన్నాడని విమర్శించారు. రూ.69 వేల కోట్లతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఏడు లక్షల 50 వేల కోట్లు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశాడని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు తనకు గురువని అంటున్నారని.. అవును అది నిజమేనని అన్నారు. చంద్రబాబు నాకు గురువే.. కానీ కేసీఆర్(KCR)కి ఘరానా మోసగాడు అయిన చార్లెస్ శోభరాజ్ గురువు అని రేవంత్(Revanth Reddy) ఎద్దేవా చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో జూపల్లి వెంట మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, నిజాంబాద్ మాజీ పోలీస్ కమిషనర్ నాగరాజు, మెగారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకు ఉన్నారు.