YS Sharmila: రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదంటూ కేసీఆర్ రహస్య జీవోను ఎందుకు విడుదల చేశారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వైయస్ షర్మిల (YS Sharmila) ప్రజా ప్రస్థానం పాదయాత్రను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ స్టోరీ సృష్టించి.. మునుగోడులో గెలవాలని అనుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. సింపతీ ఓట్ల కోసం కేసీఆర్ కొత్త సినిమాను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. మునుగోడులో గెలిచేందుకు ఊరికో ఎమ్మెల్యేను.. రాష్ట్రంలోని అందరి మంత్రులను రంగంలోకి దించారన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ సీబీఐ విచారణ కోరితే.. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టేందుకు వీలు లేదని సీఎం కేసీఆర్ రహస్య జీవోను జారీ చేశారని దుయ్యబట్టారు. ఆధారాలుంటే బయటపెట్టడానికి ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులైతే సీబీఐకు ఎందుకు భయపడుతున్నారని షర్మిల నిలదీశారు.
KCR తన MLAలతో ఫామ్ హౌజ్ స్టోరీ సృష్టించి, సానుభూతితో మునుగోడులో గెలవాలనుకున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని BJP కోర్టుకెళ్తే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదని KCR రహస్య జీవోను విడుదల చేశాడట.మీకు నిజంగా నిజాయతీ ఉంటే సీబీఐ వస్తే భయమెందుకు?#PrajaPrasthanam #Korutla pic.twitter.com/8HlKnyx3gP
— YS Sharmila (@realyssharmila) October 30, 2022
ఎనిమిదేండ్లుగా మునుగోడు అభివృద్ధి గురించి కేంద్రంలోని BJPకి గుర్తుకు రాలేదు. రాష్ట్రంలోని TRSకు గుర్తుకు రాలేదు. ఉపఎన్నిక రాగానే అభివృద్ధి గుర్తుకొచ్చింది.అంటే ఎన్నికలే మీకు ముఖ్యమా? ఓట్లు వేసిన ప్రజలంటే లెక్కలేదా? ఇన్నాళ్లు మునుగోడు మీ కంటికి కనిపించలేదా?#PrajaPrasthanam pic.twitter.com/YS2Bd8jsTY
— YS Sharmila (@realyssharmila) October 30, 2022
కోరుట్లకు తండ్రీకొడుకులిద్దరూ ఎమ్మెల్యేలట. ఇద్దరు MLAలుగా ఉండి ఒక్కరికైనా మేలు చేశారా? అంటే అదీ లేదు. MLA విద్యాసాగర్ రావు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకుంటే ఉరి వేసుకుంటానన్నారు. రెండు గ్రామాలను దత్తత తీసుకుని గాలికొదిలేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా కబ్జాలు పెడుతున్నాడు. pic.twitter.com/OhAkTUIuQ1
— YS Sharmila (@realyssharmila) October 30, 2022