ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదు. తాగుబోతుల మీద ఉన్న ప్రేమ.. సర్కారీ బడుల్లో వసతుల కల్పన మీద లేదు. తాగు, తాగిపించు ఇదే దొరకు తెలిసిన రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలో బడుల కన్నా బార్లే ఎక్కువ. విద్యార్థుల కన్నా మందుబాబులే మక్కువ. విద్యాభివృద్ధిపై దొర చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదు. కేసీఆర్ మనవడు(KCR Grandson), రంగయ్య మనవడు ఒకే బువ్వ తినాలి, ఒకే చదువు చదవాలి అని మాయ మాటలు చెప్పాడు.
సర్కారీ బడుల్లో సౌలత్‌లు లేక, రంగయ్య మనవడు తెల్లమొహం ఏస్తే.. కేసీఆర్ మనవడు అంగరంగ వైభవంగా పట్టాలు అందుకుంటున్నడు. రూ.3500 కోట్లతో మన ఊరు-మన బడి అంటూ ఊదరగొట్టారు. కార్పొరేట్‌ను తలదన్నే ఎడ్యుకేషన్ అని గొప్పలు చెప్పారు. ఏటికేటా అడ్మిషన్లు హైక్ అంటూ ఫేక్ కథలు అల్లారు. అసలు విషయం ఆరా తీస్తే దొర గారి విద్యా వ్యవస్థ అంతా పైన పటారం, లోన లొటారం. 26 వేల పాఠశాలలకు, 12వందల స్కూళ్లను బాగుచేయడం దొర చెప్పే విద్యాభివృద్ధి. 3 వేల కోట్లు కేటాయించి 30 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం దొరకు విద్యా వ్యవస్థపై ఉన్న ప్రేమ. సగానికి సగం స్కూళ్ళలో 30 మంది విద్యార్థులు లేకపోవడం విద్యాశాఖ గొప్ప పనితనం. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక వృత్తి విద్యను ఆగం చేసిన మోసగాడు కేసీఆర్.’’ అంటూ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also:
1. మీరు వైఎస్ఆర్‌కే పుట్టారా.. జగన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat