అసెంబ్లీ ఎన్నికల్లో 119 టికెట్లు రైతులకే ఇవ్వాలి

-

ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్(BRS) సర్కార్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో ఉన్నారని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతున్నాడని చురకలంటించారు. సీఎం చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమేనా అని ప్రశ్నించారు. పంట బీమా ఇవ్వక పోవడం, పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడం, రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేయడం  మోడలా? అని నిలదీశారు. కేసీఆర్‌(KCR)కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...