ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా.. MLC కవితపై షర్మిల సీరియస్

-

ఎమ్మెల్సీ కవితకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు(YS Sharmila) సవాల్ చేశారు. ఈ మేరకు ఆమే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నీ బండారం బట్టబయలైతే, అవి మీడియా ప్రసారం చేస్తే.. పాత్రికేయులకు, మీడియా సంస్థలకు విలువలు లేవని మాట్లాడుతున్న నీకు.. ఏం విలువ ఉన్నట్టు?’ అని నిలదీశారు. బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ… బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా.! అని విమర్శించారు.

- Advertisement -

లిక్కర్ స్కాంలో(Liquor Scam) రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? అని ప్రశ్నించారు. లేదా లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇవ్వమంటావా? అంటూ సెటైర్లు వేశారు. ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. లిక్కర్ స్కాంకు పాల్పడ్డ తనను, సస్పెండ్ చేయకుండా రాచమర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్‌లో స్వాగతం పలికారన్నారు. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్(KCR) ఢిల్లీ వీధుల్లో తిరిగారని షర్మిల(YS Sharmila) ఆరోపించారు.

Read Also: బీఆర్‌ఎస్‌ పార్టీకి బలం, బలగం గులాబీ సైన్యమే: మంత్రి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...