YS Sharmila |ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ సర్కారు పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందని విమర్శించారు. ఇలాంటి సమయంలో అందరం ఒక్కటై ముందుకు వేయాలని విపక్షాలను కోరారు. ఈ మేరకు గురువారం విపక్షాలకు లేఖ రాశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా రాష్ట్రపతి కలుద్దామని, అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను కేసీఆర్ దోచుకుతింటోందని, ఇలాంటి పరిస్థితుల్లో మనం మౌనం వహించొద్దని కలిసిగట్టుగా వెళ్లా్ల్సిందే అని అన్నారు. ఉమ్మడిగా పోరాడితే ఏదైనా సాధించగలమని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సరికాదని బీఆర్ఎస్ సర్కార్‌కు హితవు పలికారు.