సోమేష్ కుమార్ను సీఎంకు ముఖ్య సలహాదారుగా నియమించడం వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంటెద్దు పోకడతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగా సలహాలు తీసుకోని వ్యక్తికి సలహాదారులు ఎందుకో అని సెటైర్లు వేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె(YS Sharmila).. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దోచిపెట్టే సలహాదారులను పక్కన చేర్చుకున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పక్క రాష్ట్రాల వ్యక్తులకు లక్షల జీతమిచ్చి మేపుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్(KCR)కు, బీఆర్ఎస్(BRS) పార్టీకి పని చేస్తున్నారని వీళ్లు ప్రజా సమస్యలపై ఏం సలహా ఇస్తారని నిలదీశారు.
Read Also: కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
Follow us on: Google News, Koo, Twitter