నిజామాబాద్ ఆసుపత్రిలో రోగిని నేలపై లాక్కుని తీసుకెళ్లడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల(YS Sharmila) స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రోగులను నేలపై లాక్కొని వెళ్లడమే కార్పొరేట్ వైద్యమా? అని నిలదీశారు. స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? అని మండిపడ్డారు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన కేసీఆర్‌ది అని ఆమె ధ్వజమెత్తారు. ఇది ఆరోగ్య తెలంగాణ కాదని, ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణకు నిదర్శనం నిజామాబాద్ ఘటన అని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -
Read Also: MLC కవితకు బిగ్ షాక్.. మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్
Follow us on: Google News, Koo, Twitter