ఉగాది ఎన్నిగంట‌ల‌కు చేసుకోవాలి? ఆరోజు ఏది మంచి స‌మ‌యం

ఉగాది ఎన్నిగంట‌ల‌కు చేసుకోవాలి? ఆరోజు ఏది మంచి స‌మ‌యం

0
131

ఉగాది మ‌న దేశంలో అంద‌రూ చేసుకునే పండుగ… అస‌లు కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం అయ్యేది నేటి నుంచి అని మ‌నకి తెలిసిందే, తెలుగువారు దీనిని పెద్ద పండుగ‌గా జ‌రుపుకుంటారు..కర్ణాటక, ఆంధ్ర‌ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి, పిండివంటలు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్ని కళకళలాడుతాయి. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. మ‌రి మ‌న‌కు ఈ ఏడాది ఈనెల 25న ఉగాది వ‌చ్చింది.

బుధవారం ఉదయం గం. 6 నుండి 11 గం. లోపు ప్రతి ఒక్కరూ ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేసేసుకోవాలి. ఇక ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది.. ఏదైనా కొత్త వ్యాపారాలు వ‌స్తువులు కొనాలి అంటే ఉద‌యం 11 లోపు చేసుకోవాలి.
ఉదయం పూజ సమయంలో లేదా మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం గం.4.30 లోపు కాని అకౌంట్స్‌ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. ప్ర‌ముఖ పండితులు చెప్పిన మాట‌లు తెలియ‌చేస్తున్నాము.