ఉగాదిరోజు చేయవలసిన పనులు ఇవే

ఉగాదిరోజు చేయవలసిన పనులు ఇవే

0
179

చైత్రశుద్ధ పాడ్యమి ఈ రోజు ఉగాది జరుపుకుంటాం, ఉగాదిని తెలుగువారి సంవత్సరాదిగా జరుపుకుంటాం, కొత్తవ్యాపారాలకు కూడా ఇది మంచి ముహూర్తంగా చెబుతారు.. ఈరోజు ఉదయం లేచి
సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి, కచ్చితంగా తలకి స్నానం చేయాలి, తర్వాత కొత్త బట్టలు కట్టుకుని దేవాలయానికి వెళ్లాలి.

గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాదిరోజున లయకారుడైన శివుని కొలిచినా, ప్రకృతికి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా మంచిదే, లేదా మీకు నచ్చిన దేవుడ్ని కొలవచ్చు, మీరు ఆరోజు దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.

సంవత్సరపు మొదటిరోజు కాబట్టి ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు. ఇక కొత్తగా ఓ నీటి కుండని ఈ రోజు దానం చేస్తే మంచిది షడ్రుచులతో ఇంటిలో చేసిన ఉగాది పచ్చడి తింటే ఎంతో మంచిది. ఈరోజు ఎవరికైనా డబ్బులు వెండి దానం చేసినా మంచిదే.